జపాన్ ప్రధాని షింజో అబేతో మోడీ భేటీ

ప్రధాని నరేంద్ర మోడీ థాయిలాండ్ పర్యటన కొనసాగుతోంది. బ్యాంకాక్ లో జపాన్ ప్రధాని షింజో అబేతో సమావేశమయ్యారు మోడీ. ఇరు దేశాల మధ్య ధ్వైపాక్షిక అంశాలపై ఇద్దరు నేతలు చర్చించారు. రెండు దేశాల ప్రతినిధులు కూడా చర్చల్లో పాల్గొన్నారు. వియత్నాం ప్రధాని, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ లతో ప్రధాని ఇవాళ సమావేశం కానున్నారు.

ఈస్ట్ ఏసియా-RCEP సమ్మిట్ కు ప్రధాని హాజరవుతారు. నిన్న బ్యాంకాక్ లో నిర్వహించిన ఆసియాన్-ఇండియా సదస్సుకు మోడీ హాజరయ్యారు. తమ ప్రభుత్వం తీసుకొచ్చిన యాక్ట్ ఈస్ట్ పాలసీ…ఇండో పసిఫిక్ విజన్ లో కీలక భాగమని చెప్పారు. సమ్మిళిత, శక్తివంతమైన, ఆర్థికంగా సంపన్నమైన ఆసియాన్ ను భారత్ కోరుకుంటోందన్నారు ప్రధాని మోడీ.

Latest Updates