ఢిల్లీ అల్లర్లపై ప్రధాని మోడీ ట్వీట్

ఢిల్లీ అల్లర్లపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఢిల్లీ ప్రజలంతా ప్రశాంతంగా ఉండాలని, అన్ని సమయాల్లోనూ శాంతి సామరస్యాలతో, సోదరభావంతో మెలగాలని ఈ మేరకు ట్విటర్ లో ట్వీట్ చేశారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితిని పూర్తిగా సమీక్షించామని, శాంతి..సామరస్య వాతావరణాన్ని నెలకొల్పేందుకు పోలీసులు, ఇతర ఏజెన్సీలు పనిచేస్తున్నాయని చెప్పారు. ఢిల్లీ ప్రజలు శాంతి, సోదరభావాలను సంయమనంతో అన్ని సమయాల్లో కొనసాగించాలని అభ్యర్ధిస్తూ ట్వీట్ చేశారు.

ఆందోళనకారుల జరిపిన దాడిలో ఒక హెడ్ కానిస్టేబుల్ మృతి చెందిన సంగతి మరవకముందే.. తాజాగా మరో పోలీస్ అధికారి ఈ అల్లర్లకు బలయ్యారు. ఇంటెలిజెన్స్ బ్యూరోలో సెక్యూరిటీ అసిస్టెంట్‌గా పనిచేస్తోన్న అంకిత్ శర్మ(26) అనే పోలీస్ అధికారి అల్లర్లకు తీవ్రంగా గాయపడి మృతిచెందారు.  ఈ హింసాత్మక ఘటన వల్ల డిల్లీలో ఇప్పటి వరకు 22 మంది మృతి చెందారు.

Latest Updates