న్యూట్రీ ట్రైన్ ప్రారంభించిన మోడీ

సొంత రాష్ట్రం గుజరాత్ లో పర్యటిస్తున్నారు ప్రధాని నరేంద్రమోడీ. కేవడియాలో ఆరోగ్యవనం, న్యూట్రీషన్ పార్క్ తో పాటు.. ఏక్తా మాల్ ను ప్రారంభించారు. తర్వాత పార్క్ మొత్తం.. ఎలక్ట్రిక్ కార్ లో తిరిగి పరిశీలించారు. పార్క్ లో న్యూట్రీ ట్రెయిన్ ను ప్రారంభించిన ఆయన.. అందులో ప్రయాణించారు. పార్క్ సిబ్బందితో మాట్లాడారు.

శనివారం కూడా గుజరాత్ లోనే ఉంటారు ప్రధాని మోడీ. సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినం సందర్భంగా నిర్వ హించే ఏక్తా దివస్ పరేడ్ లో పాల్గొంటారు. నర్మదా నదీ తీరంలోని ఐక్యతా విగ్రహం దగ్గర పటేల్ కు నివాళులు అర్పించనున్నారు. అన్ని అధికారిక భాష ల్లో రూపొందించిన ఐక్య త విగ్రహ నూతన వెబ్ సైట్ ను లాంఛ్ చేయనున్నారు మోడీ. కెవాడియా-అహ్మ దాబాద్ మధ్య సీప్లేన్ సేవలను జాతికి అంకితం చేస్తారు.

Latest Updates