ప్రధాని నివాసం నుంచి పార్లమెంటు వరకు సొరంగమార్గం!

దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటివరకు ఉన్న రాజ్యాంగ సంస్థల భవనాలు, ప్రభుత్వ భవనాలను మార్చడానికి, కొత్త రూపు కల్పించడానికి సెంట్రల్ విస్టా పేరుతో సరికొత్తగా రూపకల్పన చేస్తోంది. ఈ సెంట్రల్ విస్టా ప్రణాళికలో భాగంగా ప్రధాని నివాసం నుంచి పార్లమెంటు వరకు సొరంగ మార్గం ఏర్పాటు చేయనున్నారు. ప్రధాని పార్లమెంటు భవన్ కు, కార్యాలయానికి వెళుతున్న సందర్భంలో ట్రాఫిక్‌‌ను క్లియర్ చేసేందుకు చాలా ఇబ్బందులు వస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

దీంతో పార్లమెంటు భవనంకు కొన్ని ప్రత్యేక రహదారులు నిర్మించాలని పటేల్ చెప్పారు. దీని ద్వారా సాధారణ ట్రాఫిక్ నుంచి ప్రధాని వంటి VVIPలను వేరు చేసేందుకు ఈ మార్గం ఉపయోగపడనుంది. ప్రధాని వంటి ఉన్నతస్థాయి వ్యక్తులు వెళ్లే సమయంలో సామాన్యులు ట్రాఫిక్ లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సెంట్రల్ విస్టాలో భాగంగా ఏర్పాటు చేసే ప్రత్యేక టన్నెల్ తో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని సెంట్రల్ విస్టా ప్రాజెక్టు రూపకర్త బిమల్ పటేల్ తెలిపారు. అంతేకాదు వీవీఐపీలకు భద్రత కల్పించడం కూడా వీలవుతుందన్నారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా ప్రధాని నివాసాన్ని కూడా సౌత్ బ్లాక్‌కు మారుస్తున్నట్లు సమాచారం.

Latest Updates