అయోమయంలో పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ హోల్డర్లు.

మహారాష్ట్రలోని ‘పంజాబ్​ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ (పీఎంసీ)’ బ్యాంక్​లో ఫ్రాడ్​ బయటపడి దాదాపు రెండు నెలలు కావస్తోంది. బ్యాంక్​లో డబ్బు దాచుకున్న డిపాజిటర్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సరైన భరోసా లభించక ధైర్యం కోల్పోయి ఇప్పటివరకు 10 మంది చనిపోయారు. కష్టపడి కూడబెట్టిన పైసా పైసా ఇప్పుడు బ్యాంక్​లో చిక్కుపడిపోయింది. సొమ్ములు చేతికొచ్చే దారిలేక వాళ్ల ఫ్యామిలీలు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నాయి. అసెంబ్లీ ఎలక్షన్స్​ రిజల్ట్​ వచ్చి సుమారు నెలరోజులవుతున్నా సర్కారు ఏర్పడకపోవటంతో బాధితులు ఎవరికి మొరపెట్టుకోవాలో తెలీని అయోమయంలో పడ్డారు.

డిపాజిట్​ చేసిన డబ్బుకి మ్యాగ్జిమం రూ.లక్ష వరకు సెక్యూరిటీ కల్పించేందుకు ప్రస్తుతం ఇన్సూరెన్స్​ స్కీమ్​ అమల్లో ఉంది. ఒక వ్యక్తి మల్టిపుల్​ డిపాజిట్లు చేసినా ఒక్క డిపాజిటర్​గానే పరిగణించి బీమా చెల్లిస్తారు. పీఎంసీ బ్యాంక్​ని మరో బ్యాంక్​లో విలీనం చేసినా ఇన్సూరెన్స్​ వర్తించేలా రూల్స్​ పెట్టారు. అయితే, పీఎంసీ బ్యాంక్​లో ఊహించని విధంగా స్కామ్​ జరగటంతో బీమా సీలింగ్​ని​ పెంచాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఎన్నో ఏళ్ల కిందట విధించిన ఈ లక్ష రూపాయల లిమిట్​ని ఇప్పటికీ కొనసాగించటం సరికాదని అభిప్రాయపడుతున్నారు. స్కామ్​పై లోతుగా విచారణ జరిపి దోషులను గుర్తించి శిక్షలు పడేలా ఇన్వెస్టిగేటింగ్​ ఆఫీసర్లు చూస్తారు.

ఇదంతా జరిగే లోపు అకౌంట్​ హోల్డర్ల ఆర్థిక సమస్యల్ని తక్షణం తీర్చేలా రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా(ఆర్బీఐ), ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని సోషల్​ యాక్టివిస్టులు సూచిస్తున్నారు. వాళ్ల ప్రాక్టికల్​ ప్రాబ్లమ్స్​ని అర్థం చేసుకోవాలి. పీఎంసీ బ్యాంక్​ ఇచ్చిన షాక్ ప్రభావం ఇతర బ్యాంకుల కస్టమర్లనూ వెంటాడుతోంది. ప్రజల్లో నెలకొన్న ఈ భయాన్ని తొలగించకపోతే బ్యాంకింగ్​ వ్యవస్థపైనే నమ్మకం పోయే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం యూనిట్​ ట్రస్ట్​ ఆఫ్​ ఇండియా తన కమిట్​మెంట్లను నిలబెట్టుకోలేక డిఫాల్ట్​ కావటంతో ప్రభుత్వమే జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని గుర్తు చేస్తున్నారు.

నమ్మకం పోతే అంతే సంగతలు

బ్యాంక్​, ఫైనాన్షియల్​ ఫ్రాడ్​ కేసుల్లో సూపర్​విజన్​ మెకానిజం పూర్తిగా ఫెయిల్​ అయినట్లు క్లియర్​గా తెలుస్తోందని ఫైనాన్షియల్​ ఎక్స్​పర్ట్​లు అంటున్నారు. బ్యాంకులను, ఫైనాన్షియల్​ సంస్థల్ని కట్టుదిట్టంగా కంట్రోల్​ చేయటానికి ఇకనైనా కొత్త రూల్స్​కి, ఇన్వెస్టిగేషన్స్​కి రూపకల్పన చేయాల్సిన అవసరం ఉందన్నారు. పీఎంసీ లాంటి ఎపిసోడ్లు ప్రజలకు క్రమంగా బ్యాంకింగ్​ వ్యవస్థపై నమ్మకం పోయేలా చేస్తాయి. అధిక సేవింగ్స్​ రేటే ఇండియన్​ ఫైనాన్షియల్​ సిస్టమ్​లోని బలమైన అంశమనే ప్రచారం చానాళ్లుగా కొనసాగుతోంది. కానీ.. అది సరికాదని అంటున్నారు.  బ్యాంకులను, ఎల్​ఐసీ వంటి సంస్థలను జనం ముఖ్యంగా సీనియర్​ సిటిజన్లు ఎప్పుడూ నమ్మకానికి మారు పేరుగా భావిస్తున్నారు. ఈ నమ్మకం ఒక్క రోజులో సంపాదించింది కాదు. కొన్నేళ్లుగా కష్టపడి సాధించింది. ఇంతటి విలువైన విశ్వాసాన్ని పోగొట్టుకోవటానికి ఏళ్లు కాదు. రోజులు చాలు. డబ్బుల్ని బ్యాంకుల్లో వేసినా సెక్యూరిటీ లేదని జనం భావిస్తే బ్యాంకింగ్​ వ్యవస్థ కుప్పకూలుతుందని ఆర్థికరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

Latest Updates