బెంగాల్ దుర్గ పూజల్లో పాల్గొననున్న ప్రధాని మోడీ

కోల్‌‌కతా: బెంగాల్‌‌లో దుర్గ పూజ వేడుకలు వేదికగా రాజకీయ యుద్ధం మొదలయ్యేలా కనిపిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా కొన్ని నెలల సమయమే ఉండటంతో అధికార తృణమూల్ కాంగ్రెస్, విపక్ష బీజేపీ ఎన్నికల సన్నాహకాలను మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలో దుర్గ పూజ ఉత్సవాలు తృణమూల్, బీజేపీల మధ్య వార్‌‌కు కేంద్రంగా మారనున్నాయి. గతేడాది సాల్ట్‌‌లేక్‌‌లో నిర్వహించిన దుర్గ పూజల ఆరంభ వేడుకలకు అమిత్ షా వచ్చిన విషయం తెలిసిందే. అప్పుడు వివాదం చెలరేగింది. ఈసారి అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో బీజేపీ స్వయంగా దుర్గ ఉత్సవాలను నిర్వహించ తలపెట్టింది. ఈ వేడుకల్లో ప్రధాని మోడీ వర్చువల్‌‌గా పాల్గొననున్నారు.

అక్టోబర్ 22న బీజేపీ మహిళా మోర్చాతోపాటు కల్చరల్ వింగ్ ఈజెడ్‌‌సీసీ నిర్వహించనున్న దుర్గ పూజ ఆరంభ వేడుకల్లో ప్రధాని మోడీ వర్చువల్‌‌‌గా పార్టిసిపేట్ చేయనున్నారు. దుర్గ పండల్ తరహాలో అమ్మ వారి భారీ సైజు విగ్రహాన్ని ఏర్పాటు చేసి, ఉత్సవాలను నిర్వహించేందుకు బీజేపీ సన్నాహాలు చేస్తోంది. దుర్గ పూజల్లో మొదటి రోజు అయిన శాశ్తి సందర్భంగా సోషల్ మీడియా ప్లాట్‌‌ఫామ్స్‌‌తోపాటు ఇతర మాధ్యమాల ద్వారా బెంగాల్ ప్రజలకు మోడీ విషెస్ చెప్పనున్నారు.

Latest Updates