PNB కేసు : నీరవ్ కు నోటీసు

NIRAV NOTICEPNB కేసుకు సంబంధించి వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి ఉచ్చు బిగుస్తోంది. ఈ క్రమంలోనే నీరవ్ కి సోమవారం (జూలై-2) రెడ్‌కార్నర్ నోటీసులు ఇచ్చింది ఇంటర్‌ పోల్. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ కు వేల కోట్లు ఎగవేసిన కేసులో ఈ నోటీసులు జారీ అయ్యాయి. నీరవ్ మోడీ సోదరుడు నిషాల్ మోడీ, ఆయన కంపెనీ ఎగ్జిక్యూటివ్ సుభాష్ పరబ్‌కు నోటీసులిచ్చింది ఇంటర్‌ పోల్. నీరవ్‌ కు రెడ్‌ కార్నర్ నోటీసులు ఇవ్వాలని ఇంటర్‌ పోల్‌ ను ఇటీవల కోరింది ED.

నీరవ్‌ పై మనీల్యాండరింగ్ కేసును ED నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇంటర్‌ పోల్ నోటీసు ప్రకారం.. సభ్యత్వం ఉన్న దేశాల్లో ఎక్కడ నీరవ్ ఉన్నా.. అతన్ని అరెస్టు చేసే వీలుంటుంది. ప్రస్తుతం నీరవ్.. బ్రిటన్‌ లో ఉన్నాడన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అతనిపై నాన్‌ బెయిలబుల్ వారెంట్ ఉంది. జూన్ 28వ తేదీన విదేశాంగ శాఖ ఓ ప్రకటన చేసింది. నీరవ్‌ కు ఎంట్రీ ఇవ్వవద్దంటూ వివిధ దేశాలను అభ్యర్థించింది. ఫ్రాన్స్, యూకే, బెల్జియం లాంటి యురోపియన్ దేశాల నుంచి విదేశాంగ శాఖ సాయం కోరింది.

Posted in Uncategorized

Latest Updates