PNB స్కాం: చోక్సీపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసిన ఇంటర్ పోల్

పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కాం (PNB) వ్యవహారంలో మెహుల్ చోక్సీపై ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. చోక్సీ ఈ ఏడాది మొదట్లో అంటిగ్వా పౌరసత్వం తీసుకున్నాడు. సీబీఐ విజ్ఞ‌ప్తితో ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది.

రెడ్ కార్నర్ నోటీసులు ఇవ్వడమంటే ఇంటర్‌పోల్‌లోని 192 సభ్యదేశాల బోర్డర్స్ లో చోక్సీ ఎక్కడ కనిపించిన ఆ దేశ పోలీసులు అరెస్టు చేసే అధికారం ఉంది. రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడం ద్వారా చోక్సీని, నీరవ్ మోడీలను భారత్‌కు రప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. నీరవ్ పై రెడ్ కార్నర్ నోటీసులను ఈ ఏడాది జూలైలో జారీ చేసింది. నీరవ్ మోడీ, చోక్సీలకు సంబంధించి కేసును ఈడీ, సీబీఐలు విచారణ చేస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 15న నీరవ్, చోక్సీలపై మనీ లాండరింగ్ కేసును నమోదు చేసి ఈడీ దర్యాప్తు చేస్తోంది. సీబీఐ నమోదు చేసి FIR ఆధారంగా ఈడీ విచారణ చేపడుతోంది. మరోవైపు నీరవ్, చోక్సీలపై కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది.

 

Posted in Uncategorized

Latest Updates