పుతిన్ ప్ర‌త్య‌ర్ధిపై విష‌ప్ర‌యోగం..23రోజుల త‌రువాత ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ్

రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నవాల్నీ ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. జర్మనీలోని బెర్లిన్ చరైట్ ఆసుపత్రిలో 32 రోజుల ట్రీట్మెంట్ త‌రువాత ఆరోగ్యం కుదుటుప‌డింద‌ని డాక్ట‌ర్లు తెలిపారు.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రత్యర్థి నవల్నీ ఆగస్ట్ 20 న రష్యాలో దేశీయ విమానంలో అనారోగ్యానికి గురైన రెండు రోజుల తరువాత జర్మనీకి వెళ్లారు.

జ‌ర్మనీ వెళ్లిన త‌రువాత అక్క‌డ చ‌రైట్ ఆస్ప‌త్రిలో జాయిన్ అయ్యారు. ఈ సంద‌ర్భంగా జర్మనీ రసాయన ఆయుధాల నిపుణులు మాట్లాడుతూ 44 ఏళ్ల సోవియట్ యుగం నాటి విషాన్ని న‌వాల్నీ బాడీలో ఇంజెక్ట్ చేసిన‌ట్లు నిర్ధారించారు. దీంతో ఈ కేసును రష్యా దర్యాప్తు చేయాలని జ‌ర్మ‌నీని కోరింది.

కాగా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న న‌వాల్ని టార్గెట్ చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. రెండు వారాల పాటు న‌వాల్ని కోమాలోనే ఉన్నారు. విష‌ప్ర‌యోగం విష‌యంలో ర‌ష్యాను నిల‌దీయాల‌ని జ‌ర్మ‌నీ డిమాండ్ చేస్తున్న‌ది.

Latest Updates