బాధతో ముంబైని వీడుతున్నా: కంగన రనౌత్

ముంబై: బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే) వ్యాఖ్యలపై వివాదం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. ఎంపీ సంజయ్ రౌత్‌‌‌, మహారాష్ట్ర సర్కార్‌‌తోపాటు శివ సేన పార్టీ కంగనపై మండిపడుతున్నాయి. బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) అక్రమ కట్టడం పేరుతో కంగన ఆఫీస్‌‌ను కూల్చేయడంతో ఈ వివాదం మరింత రాజుకుంది. ఈ నేపథ్యంలో పీవోకే వ్యాఖ్యలను కంగన సమర్థించుకున్నారు. సోమవారం ఆమె ముంబైని వీడారు. ఈ నేపథ్యంలో ఓ ట్వీట్ చేశారు. ‘బాధాతప్త హృదయంతో ముంబైని వీడుతున్నా. గత కొద్ది రోజులుగా నన్ను లక్ష్యంగా చేసుకొని బాధపెట్టారు. నాపై విమర్శలకు దిగారు, భయభ్రాంతులకు గురి చేశారు. నా పని స్థలాన్ని కూల్చారు. నా చుట్టూ కమాండోలు ఆయుధాలతో సెక్యూరిటీగా నిలిచారు. నేను చేసిన పీవోకే వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నా’ అని కంగన ట్వీట్ చేసింది. ఇవ్వాళ ఉదయం 7.30 గంటలకు కంగన ముంబై ఎయిర్‌‌పోర్ట్‌‌కు చేరుకుంది. వై-కేటగిరీ సెక్యూరిటీతోపాటు ముంబై పోలీసులు రక్షణగా నిలువగా ఆమె ఎయిర్‌‌పోర్ట్‌‌‌కు వెళ్లింది.

Latest Updates