షాద్‌నగర్‌లో హై అలర్ట్ ప్రకటించిన పోలీసులు

షాపుల బంద్ చేయించిన పోలీసులు

కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తుండడంతో రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు.  ఈశ్వర్ కాలనీలో ఒక వ్యక్తికి కరోనా లక్షణాలు ఉండటంతో వైద్యాధికారులు ముందస్తు జాగ్రత్తగా ఆస్పత్రికి తరలించారు. స్థానిక పోలీసులు మెయిన్ రోడ్, విజయనగర్ కాలనీ తదితర ప్రాంతాల్లో ఎలాంటి రాకపోకలు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా మెయిన్‌రోడ్‌, గంజ్ ప్రాంతాల్లోని వ్యాపార సముదాయాలను పోలీసులు మూసి వేయించారు.  శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి.. షాద్ నగర్ పట్టణంలోని కంటెయిన్‌మెంట్ జోన్‌ను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు.

For More News..

కానిస్టేబుల్ దయాకర్ రెడ్డి కుటుంబాన్ని ఆదుకుంటాం: సీపీ అంజనీకుమార్

పబ్లిక్ టాయిలెట్‌లో ఉరేసుకున్న యువకుడు

వీడియో: సీసీటీవీలో రికార్డయిన పాక్ విమాన ప్రమాదం

Latest Updates