కరోనాను తరిమికొట్టడానికి పోలీసులు 24గంటల డ్యూటీ

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా 63 వేల మంది పోలీసులతో పాటు11 వేల మంది హోంగార్డ్స్ కరోనా నుంచి ప్రజలను కాపాడేందుకు పని చేస్తున్నరు. ఇందులో లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, స్పెషల్ బ్రాంచ్, ఐబీ, హోంగార్డ్స్ నిరంతరం ఆన్ డ్యూటీలో ఉంటున్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ పై గైడ్ లైన్స్ జారీ చేసిన వెంటనే పోలీస్ డిపార్ట్ మెంట్ ‘స్టాండ్ టు’ లోకి వచ్చింది. అనారోగ్య పరిస్థితిలో సిక్ లీవ్ లో ఉన్న సిబ్బంది మినహా ప్రతీ పోలీస్ ఆన్ డ్యూటీలోకి వచ్చాడు. మూడు షిఫ్టుల్లో పని చేస్తూ కరోనాను నిరోధించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నరు.  కానీ కొంతమంది జాగ్రత్తలు తీసుకోకపోవడంతో వారి ఆరోగ్యానికి ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంది.

మాస్కులు లేకనేనా?

నిజానికి డాక్టర్లు, నర్సులు, ఇంక కొన్ని డిపార్ట్‌‌‌‌మెంట్లకు ఏం తీసిపోకుండా రాష్ట్ర పోలీస్‌‌‌‌ శాఖ కరోనా కట్టడికి శ్రమిస్తోంది. జనతా కర్ఫ్యూ దగ్గర్నుంచి ఇప్పటిదాకా పోలీసోళ్లు రోడ్లకే పరిమితమయిన్రు. హాస్పిటళ్ల దగ్గర కూడా బందోబస్తులో ఉంటున్నరు. బయట దేశాల నుంచి వచ్చినోళ్లు ఇన్ఫర్మేషన్‌‌‌‌ ఇయ్యకపోతే, వాళ్లంతా ఎక్కడెక్కడున్నరో అని తిరిగి తిరిగి పట్టుకుంటున్నరు. అంబులెన్సుల్లో ఎక్కించి టెస్టులకు పంపుతున్నరు. క్వారంటైన్‌‌‌‌ ఇండ్ల దగ్గర కావలి కాస్తున్నరు. అయితే వీళ్లు జాగ్రత్తల విషయంలో కొంచెం వెనకబడే ఉన్నరు. కావాల్సినన్ని మాస్కులు లేకనే ఇట్ల జరుగుతోందని కొందరు పోలీసులు చెబుతున్నరు.

లీడర్లతో పరేషాన్​

రాజకీయ నాయకులు రోడ్ల మీదకు రాగానే పోలీసోళ్ల పరేషానీ డబులైతంది. లీడర్‌‌‌‌కు ప్రొటెక్షన్‌‌‌‌ ఇచ్చేందుకు, జనాన్ని కంట్రోల్‌‌‌‌ చేసేందుకు గుంపులు గుంపులుగా ఉండాల్సి వస్తోంది. లీడర్లు కూడా బయటకు వచ్చేటపుడు క్యాడర్‌‌‌‌ను పిలిపించుకుంటున్నరు. ఆఫీసర్లందర్నీ రమ్మంటున్నరు. జనం ఉండే దగ్గరికి పోతున్నరు. దీంతో కంట్రోల్‌‌‌‌ చేసేందుకు ఎక్కువ మందే పోలీసులు పోవాల్సి వస్తోంది. దీనివల్ల సోషల్‌‌‌‌ డిస్టెన్సింగ్‌‌‌‌ లేకుండా పోతున్నది. ఎవలిండ్లకు వాళ్లు పోయినంక రోడ్లు ఖాళీ అయితే రిలాక్స్‌‌‌‌ అవుతూ ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చుంటున్నరు.

24 గంటలూ డ్యూటీలోనే…

టూ వీలర్ రైడర్స్ చాలా మంది మాస్క్ లేకుండానే డ్రైవ్ చేస్తున్నరు. వీళ్లతో పాటు కార్లల్లో వస్తున్న వాళ్లను ఆపుతున్న పోలీసులు దగ్గరగా వెళ్లి వివరాలు అడుగుతున్నరు. ఈ టైంలో అవతలి వ్యక్తికి కరోనా ఉంటే అది సోకే ప్రమాదం ఉంటుంది. కొంతమందితో ఆర్గ్యూ చేయాల్సి వస్తోంది. చెక్‌‌‌‌ పోస్టుల దగ్గర కూడా ఇట్లనే ఉంది. కొన్నిసార్లు జనాన్ని తాకాల్సి వస్తోంది. కొందరికి కౌన్సెలింగ్‌‌‌‌ ఇవ్వాల్సి వస్తోంది. ఈ అన్ని సందర్భాల్లోనూ వీరిది ప్రమాదకరమైన పరిస్థితే, ‘ మాలో చాలా మంది 50 ఏళ్ల పైబడ్డ వాళ్లున్నరు. వాళ్లలో కొందరికి టెన్షన్‌‌‌‌గానే ఉంది. కానీ డ్యూటీ తప్పదు కదా’ అని అన్నాడో యువ కానిస్టేబుల్‌‌‌‌.

ఇంట్లో ఉంటలేడని ఐసోలేషన్ కు తరలింపు

Latest Updates