జల్సాల కోసం ఫోన్ల చోరీ.. ఆపై అరెస్ట్

police-arrest-3-people-for-theft-a-mobile-phone

సికింద్రాబాద్: జల్సాలకు అలవాటు పడి తేలికగా డబ్బు సంపాదించవచ్చన్న లక్ష్యంతో  సెల్ ఫోన్ చోరీకి పాల్పడిన ముగ్గురు యువకులను రాంగోపాల్ పేట పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి ఒక సెల్ ఫోన్, ఒక బైకును స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. బంసిలాల్ పేట్ కు చెందిన పాత నేరస్తుడు మహేష్ అదే ప్రాంతానికి చెందిన మరో ఇద్దరు యువకులతో కలసి మొబైల్ ఫోన్లు స్నాచింగ్ చేయాలని ప్లాన్ వేసుకున్నారు. అందులో భాగంగా రాంగోపాల్ పేట్ పీఎస్ పరిధిలో తన ఇంటి ముందు ఫోన్ మాట్లాడుకుంటూ కూర్చున్న యువకుని చేతిలో నుండి సెల్ ఫోన్ లాక్కొని పారిపోయారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీ కెమెరాల ఆధారంగా బైక్ ను గుర్తించి నిందితులను అరెస్ట్ చేశామని ఇన్స్ పెక్టర్ చోట సి హెచ్ బాబు తెలిపాడు. వారిని రిమాండ్ కు తరలించినట్లు ఆయన తెలిపారు.

Latest Updates