వాచ్‌మెన్‌పై దాడి కేసులో నలుగురు అరెస్ట్

బోయిన్ పల్లి వాచ్‌మెన్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించిన కేసులో పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేశారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించారు. వారం రోజుల క్రితం ఓల్డ్ బోయిన్ పల్లి సిండికేట్ కాలనీలోని వివాదాస్పద భూమి విషయంలో.. వాచ్‌మెన్‌ శరణప్ప పై దాడి చేశారు మాధవరెడ్డి అతని అనుచరులు. వాచ్ మెన్ పై పెట్రోల్  పోసి నిప్పంటించారు. వివాదాస్పద స్థలానికి కాపలా ఉన్న వ్యక్తికి నిప్పంటించినట్లు నిందితులు పోలీసుల విచారణలో ఒప్పుకున్నారు. తీవ్ర గాయాలైన వాచ్‌మెన్‌ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు.

ఈ విషయం పై హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ.. “ఈ నెల 7 తేదీన శరణప్ప అనే వాచ్ మెన్ పై నలుగురు వ్యక్తులు పెట్రోల్ పోసి తగల బెట్టారు. ప్రకాష్ రెడ్డి అనే ఫ్లాట్ యజమాని దగ్గర శరణప్ప వాచ్ మెన్ గా పని చేస్తున్నాడు.  ఫ్లాట్ విషయం లో మాధవ్ రెడ్డి అనే వ్యక్తితో ప్రకాష్ రెడ్డి కి గొడవలు ఉన్నాయి. దీంతో ఫ్లాట్ వద్ద మాధవ రెడ్డి అనుచరులు వెళ్లి గొడవకు దిగారు. అక్కడున్న వాచ్ మెన్  అడ్డుకోవడం తో అతడి పై దాడి చేశారు , ఆ తరువాత పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. 40 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న శరణప్ప శుక్రవారం రాత్రి చనిపోయాడు.” అని తెలిపారు

ఈ ఘటనతో సంబంధమున్న తూముకుంట మాధవ రెడ్డి, సమల మాధవ రెడ్డి , జక్కుల సురేందర్ రెడ్డి, కారు డ్రైవర్ నరేష్ సింగ్ ను నార్త్ జోన్ ,టాస్క్ ఫోర్స్ పోలీసుల సహాయంతో అరెస్ట్ చేశామని కమీషనర్ చెప్పారు. ప్రధాన నిందితుడు మాధవ రెడ్డి పై గతంలో ఐదు కేసులు ఉన్నాయన్నారు. నిందితుల పై 452, 302 120(బీ), రెడ్ విత్ 212 , కింద కేసులు నమోదు చేశామన్నారు. వారి నుంచి పెట్రోల్ బాటిల్స్, ఫార్చ్యూన్ కార్,మారుతి కార్ ,6 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నామని అంజనీ కుమార్ తెలిపారు.

Police arrest four accused in case of setting fire to bowenpally Watchman

Latest Updates