అల్వాల్ చిన్నారి హత్య: నిందితుడు అరెస్ట్

ఆరేళ్ల చిన్నారిపై లైంగిక దాడి జరిపి హత్య చేసిన నిందితున్ని పట్టుకున్నారు పోలీసులు.  అల్వాల్ కు చెందిన చిన్నారిపై లైంగిక దాడి చేసి గొంతుకోసి ముళ్ల కంపల్లో పడేసి వెళ్లారు. దీంతో  కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు 24 గంటల్లో నిందితున్ని పట్టుకున్నారు. నిందితుడు రాజేశ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు… అతడిని బిహార్ కు చెందిన వాడిగా గుర్తించారు.

నిన్న మధ్నాహ్నం ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికను ఎత్తుకెళ్లిన రాజేశ్… లైంగిక దాడి చేసి హత్య చేశాడు. చిన్నారి తండ్రి ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఇవాళ కేసును ఛేదించారు.

Latest Updates