ఫోన్ ఇచ్చినందుకు అరెస్ట్ చేశారు

police-arrestes-a-auto-driver-who-giving-his-phone-to-a-unknown-person

యూపీ: ఓ అపరిచిత వ్యక్తికి  ఫోన్  ఇచ్చిన పాపానికి ఆ ఆటో డ్రైవర్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన యూపీలోని మధురలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మధురకు సమీపంలోని ప్రేమ్ మందిర్ దగ్గర మున్నా అనే ఆటో డ్రైవర్ ను ఓ టూరిస్ట్ అర్జెంట్ ఫోన్ కాల్ చేయాలని..అతని మొబైల్ ని అడిగాడు. అతని మాటలు నమ్మిన మున్నా.. ఆ టూరిస్ట్ కు ఫోన్ ఇవ్వగా , ఆ టూరిస్ట్ శ్రీ కృష్ణ జన్మస్థలమైన మధురలో , బృందావనంలో బాంబులు ఉన్నట్లుగా ఆ ఫోన్ నుంచి కాల్ చేసి చెప్పాడు. ఇలా కాల్స్ చేసి ఆ ఫోన్ ను తిరిగి ఆ ఆటో డ్రైవర్ కు ఇచ్చి వెళ్లి పోయాడు.

ఈ బాంబుల బెదిరింపు కాల్స్  విషయం పోలీసుల వరకు వెళ్లడంతో..  వారు ఎంక్వయిరీ చేసి ఆ ఫోన్ ఆటో డ్రైవర్ మున్నాకు చెందినది గుర్తించి, అతన్ని అరెస్ట్ చేశారు. కస్టడీలోకి తీసుకున్న మున్నాను విచారణ చేయగా.. ఓ అపరిచిత వ్యక్తి తన దగ్గర నుండి ఫోన్ తీసుకొని ఆ కాల్స్ చేసినట్లు తెలిపాడు. మున్నా చెప్పిన వివరాలతో పోలీసులు ఆ టూరిస్ట్ ను అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. మొత్తం 7 బృందాలుగా విడిపోయి, ఆ టూరిస్ట్ ను త్వరలోనే పట్టుకుంటామని మధుర అడిషనల్ ఎస్పీ జ్ఞానేంద్ర సింగ్ తెలిపారు.

Latest Updates