అశ్వత్థామ రెడ్డి అరెస్టుకు పోలీసుల యత్నం

RTC JAC కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఇవాళ JAC  బస్ రోకో లకు పిలుపునివ్వటంతో అశ్వత్థామ రెడ్డిని అరెస్టు చేసేందుకు పోలీసులు యత్నించారు. తెల్లవారుజామున ఎల్బీనగర్ హస్తినాపురంలోని ఆయన ఇంటి తలుపులు పగులగొట్టి ఇంట్లోకి వెళ్లేందుకు పోలీసులు యత్నించారు. దీంతో ఇంట్లోనే దీక్ష చేపడుతున్నట్లు అశ్వత్థామ రెడ్డి ప్రకటించారు. విషయం తెలుసుకున్న కార్మికులు పెద్దఎత్తున అశ్వత్థామ రెడ్డి ఇంటికి చేరుకుంటున్నారు. అశ్వత్థామ రెడ్డిని అరెస్టు చేసేందుకు వచ్చిన పోలీసులను అడ్డుకున్నారు. దీంతో కార్మికులను అరెస్టు చేశారు పోలీసులు.

Latest Updates