అబార్షన్ చేసిన డాక్టర్​పై కేసు

తొర్రూరు, వెలుగు : తొర్రూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో రూల్స్​కు విరుద్ధంగా ఓ మహిళకు అబార్షన్ చేసిన సంఘటన శనివారం వెలుగు చూసింది. డిప్యూటీ డీఎంఎంహెచ్వో డాక్టర్​ కోటాచలం, డీఎస్పీ వెంకట రమణ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని ఓ నర్సింగ్ హోంలో దంతాలపల్లి మండలం ఆగాపేట దుబ్బతండాకు చెందిన వివాహితకు మూడో సంతానంగా ఆడపిల్ల పుడుతుందనే అనుమానంతో రూల్స్​కు విరుద్ధం గా అబార్షన్ చేశారు. ఈమెకు ఇప్పటికే ఒక బాబు, పాప ఉన్నారు. అబార్షన్ చేసిన డాక్టర్ ​కె.యాదగిరిరెడ్డి, కారుకులైన ఏఎన్ఎం కల్పన, జామాలాల్, దంపతులపై కేసు నమోదు చేశారు. నర్సింగ్ హోంను సీజ్ చేశారు.

Latest Updates