ఐపీఎల్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు

మంచిర్యాల జిల్లా: ఆన్ లైన్ లో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు జిల్లా పోలీసులు. రహస్యంగా అందిన విశ్వసనీయ సమాచారం మేరకు  మార్కెట్ ఏరియాలో తనిఖీలు చేపట్టారు. బండారి రాజ్ కుమార్ అనే వ్యక్తి ఇంట్లో పోలీసులు సోదాలు చేయగా.. రహస్యంగా బెట్టింగ్ జరుగుతున్నట్లు తేలింది. టీవీ చూస్తూ.. ఫోన్లలో బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. వెంటనే 10 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బెట్టింగ్ కు ఉపయోగించిన 5 సెల్ ఫోన్లను సీజ్ చేశారు.

Latest Updates