కరోనాపై ప్రచారం షురూ

వర్ధన్నపేట, వెలుగు: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిపై  ఓరుగల్లు పోలీసులు అలర్ట్ అయ్యారు. వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట పోలీసులు సామాజిక భద్రతలో భాగంగా ఆదివారం కరోనాపై వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జనాల్లో కరోనా వ్యాధిపై ఉన్న అపోహల్ని పోగొట్టేలా ఓ రథాన్ని రూపొందించారు. వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై చైతన్య రథాన్ని ఆదివారం ప్రారంభించారు.

వర్ధన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు మండలాలు, 50 విలేజ్ లు, 20 తండాలు ఉన్నాయి. చైతన్య కార్యక్రమాల్లో భాగంగా ఈ వెహికల్ ప్రతిరోజు మూడు గ్రామాల్లో తిరుగుతుంది. కరోనా వ్యాధి ప్రభావం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రచారం చేయనుంది. పనిలో పనిగా హెల్మెట్ వాడకం, డ్రంకెన్​ డ్రైవ్, రోడ్ సేఫ్టీ, మహిళా భద్రత లో భాగంగా 100 డయల్ వంటి అంశాలను జనాల్లోకి తీసుకు వెళ్లనున్నారు.

Latest Updates