అఖిల ప్రియ భర్తపై కేసు: హైదరాబాద్ లో ఆళ్లగడ్డ ఎస్సై ఫిర్యాదు

హైదరాబాద్: టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ పై హైదరాబాద్ లో కేసు నమోదైంది. భార్గవ్ తనతో దురుసుగా ప్రవర్తించాడని, కారును మీదికి ఎక్కించబోయాడని ఆళ్లగడ్డ ఎస్సై రమేశ్ కుమార్ గచ్చి బౌలి స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

పాత కేసులో ప్రశ్నించేందుకు వస్తే..

బిజినెస్ విషయంలో అఖిల ప్రియ భర్త భార్గవ్ తనను బెదిరించారని స్టోన్ క్రసింగ్ వ్యాపారి ఒకరు ఇటీవల ఆళ్లగడ్డలో కేసు పెట్టారు. దీనిపై భార్గవ్ ను ప్రశ్నించేందుకు ఆళ్లగడ్డ ఎస్సై హైదరాబాద్ వచ్చారు. భార్గవ్ ఇంటికి వెళ్లగా.. తనకు సహకరించకపోగా, దురుసుగా ప్రవర్తించాడని, కారును తనపైకి ఎక్కించే ప్రయత్నం చేశాడని ఎస్సై రమేశ్ చెబుతున్నారు. దీనిపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఆయన ఫిర్యాదు చేశారు.

 

Latest Updates