హరీశ్ రావుపై పోలీసులకు ఫిర్యాదు

కరోనా రూల్స్ పట్టించుకోలేదన్న కాంగ్రెస్ నాయకులు

సిద్దిపేట, వెలుగు: కరోనా రూల్స్ పట్టించుకోకుండా సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో సోమవారం రాత్రి టీఆర్ఎస్ నేతలు ర్యాలీ, సభ నిర్వహించడంపై కాంగ్రెస్ నేతలు రాజగోపాలపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కరోనా నేపథ్యంలో ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలకు అనుమతిలేకున్నా నంగునూరులోని వివేకానంద విగ్రహం నుంచి చౌడు చెరువు వరకు 200 మందితో ర్యాలీ, సభ నిర్వహించారని టీపీసీసీ కార్యదర్శి దేవులపల్లి యాదగిరి తెలిపారు. ర్యాలీలో పాల్గొన్న మంత్రి హరీశ్ రావుతోపాటు టీఆర్ఎస్ మండల నాయకులు జాప శ్రీకాంత్ రెడ్డి, కోల రమేష్ గౌడ్, జయపాల్ రెడ్డితోపాటు ఇతర నాయకులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.

For More News..

సెకెండ్ హ్యాండ్‌ కార్లకు ఫుల్​ గిరాకీ

ఫిక్స్‌‌డ్‌‌ డిపాజిట్ చేసేవారికి నిరాశ

కరోనా దెబ్బకు జాడ లేకుండా పోయిన జాబులు

Latest Updates