టీఆర్ఎస్ నేతల ఇళ్లలో సోదాలు

ఉప ఎన్నికకు సమయం దగ్గర పడ్తుడంతో దుబ్బాకతో పాటు సిద్దిపేటలోని TRS నాయకుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు పోలీసులు. ఏకకాలంలో ఎనిమిది మంది ఇళ్లలో తనిఖీలు చేశారు. దుబ్బాక ZPTC రవీందర్ రెడ్డి, MPP పుష్పలత కిషన్ రెడ్డి, దుబ్బాక మార్కెట్ కమిటీ చైర్మన్ బండి శ్రీ లేఖ రాజు, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు చింత రాజు, సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి, కౌన్సిలర్ మచ్చ వేణుగోపాల్ రెడ్డి, సిద్దిపేట టౌన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు కొండం సంపత్ రెడ్డి ఇండ్లలో సోదాలు నిర్వహించారు.

Latest Updates