చంద్రబాబు ఇంటి దగ్గర భారీగా మోహరించిన పోలీసులు

TDP అధినేత చంద్రబాబు ఇంటి  దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఆయన కుమారుడు మాజీ మంత్రి లోకేశ్… TDP ఆఫీసుకి వెళ్లకుండా ఆయన వెళ్లే దారిలో ముళ్ల కంచెలు, బారికేడ్లు, రోప్‌లు పెట్టారు. ఒకవేళ లోకేశ్ బయటకు వస్తే అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు సిద్ధంగా వున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు ఇంటి నుంచి ఎవరూ అమరావతి వైపునకు వెళ్లకుండా పోలీసులు భారీగా మోహరించారు.

మరోవైపు రాజధాని ప్రాంతంలో ప్రస్తుతం సెక్షన్‌ 144, 30ని అమలు చేస్తున్నారు పోలీసులు. ఇవాళ(శనివారం) చంద్రబాబు తిరుపతి పర్యటనకు వెళ్లనున్నారు. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయం పరిసరాల్లో కూడా సెక్షన్‌ 144ను అమలు చేస్తున్నారు. పలువురు TDP నేతలను గృహ నిర్బంధం  చేశారు.

ఇవాళ తిరుపతిలో చంద్రబాబు తలపెట్టిన పరిరక్షణ సమితి ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు.

Latest Updates