స్టైలిష్​గా షేవ్ చేశారని నలుగురు బార్బర్ల అరెస్ట్

పెషావర్: కస్టమర్లకు స్టైలిష్ గా షేవ్ చేసినందుకు నలుగురు బార్బర్ లను పాకిస్తాన్ పోలీసులు అరెస్టు చేశారు. అక్కడితోనే ఆగకుండా ఒక్కొక్కరికీ రూ.5 వేలు పెనాల్టీ వేసి.. మరోసారి ఇలా చేస్తే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. నాలుగు రోజుల కిందట పాకిస్తాన్ లోని ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్ లో జరిగిన ఈ ఘటన వీడియో వైరల్ కావడంతో గురువారం డాన్ పత్రికలో దీనిపై వార్తలు వెలువడ్డాయి. ఇస్లామిక్ సాంప్రదాయం ప్రకారం ముస్లిం యువకులు స్టైలిష్ డిజైన్లలో గడ్డాలు చేయించుకోరాదంటూ అక్కడి బార్బర్ ట్రేడ్ యూనియన్ బ్యాన్ విధించింది. ఈ నేపథ్యంలో కొంతమంది షాపుల వాళ్లు బ్యాన్ పాటించట్లేదంటూ యూనియన్ ప్రెసిడెంట్ కంప్లైంట్ చేసిన మేరకే వారిని అరెస్టు చేసి కొద్ది గంటల్లోనే విడిచిపెట్టామని పోలీసులు చెబుతున్నారు. ఫైన్ వేసినట్లు వస్తున్న వార్తల్లో మాత్రం నిజం లేదని అంటున్నారు.

Latest Updates