లాక్డౌన్ డ్యూటీలో తోటి పోలీసుకు హెయిర్ కట్ చేసిన మరో పోలీస్

కరోనావ్యాప్తిని అడ్డుకునేందుకు దేశమంతా లాక్డౌన్ విధించారు. దాంతో జనాలు రోడ్లపైకి రాకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపై పడింది. అప్పటినుంచి పోలీసులు రోడ్లపైనే తింటూ, పడుకుంటూ ప్రజలు లాక్డౌన్ పాటించేలా చూస్తున్నారు. అయితే ప్రజల ప్రాణాలకు తమ ప్రాణాలు పణంగా పెట్టి డ్యూటీ చేస్తున్న పోలీసులకు మాత్రం తిప్పలు తప్పడంలేదు. తినడానికి టైంకు తిండి దొరకక, టైంకు పడుకోక, స్నానాలు ఒకరోజు చేసి మరోరోజు చేయక, ఇలా ఒకటేమిటి ఎన్నో ఇబ్బందులు పడుతూ లాక్డౌన్ ను కఠినంగా అమలుచేయడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు.

లాక్డౌన్ డ్యూటీ చేస్తున్న పోలీసులకు కటింగ్, షేవింగ్ చేసుకునే సమయం లేక అలాగే పెంచుకుంటున్నారు. కానీ రాజస్థాన్ లోని జోధ్ పూర్ నాగోరి గేట్ వద్ద లాక్డౌన్ డ్యూటీ చేస్తున్న పోలీసులు మాత్రం కొంచెం డిఫరెంట్ గా ఆలోచించారు. అందుకే డ్యూటీ చేస్తూనే.. ఒకరి జుట్టు మరోకరు కట్ చేసుకుంటున్నారు. జోధ్ పూర్ లోని నాగోరి గేట్ ఎస్‌హెచ్‌ఓ జబ్బర్ సింగ్ లాక్డౌన్ డ్యూటీలో ఉండగానే తన తోటి సహోద్యోగికి హెయిర్ కట్ చేశాడు. ఆ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

‘పోలీసు సిబ్బంది లాక్డౌన్ విధుల్లో వివిధ రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉటుంది’ అని నాగోరి గేట్ ఎస్‌హెచ్‌ఓ జబ్బర్ సింగ్ అన్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ముందుజాగ్రత్త చర్యగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మార్చి 24న దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్డౌన్ ప్రకటించారు. అయితే ఆ తర్వాత కరోనా కేసులు పెరుగుతుండటంతో.. లాక్డౌన్ ను మే3 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారం.. భారత్ లో ఇప్పటివరకు 27,964 పాజిటివ్ కేసులు నమోదుకాగా.. 884 మంది మృత్యవాత పడ్డారు.

For More News..

రాజ్ భవన్ లో నలుగురికి కరోనా..

మరణశిక్షను రద్దు చేసిన సౌదీ అరేబియా

Latest Updates