రూ.180 చలానాతో పోయేదానికి రేవంత్ ను అరెస్ట్ చేస్తరా?

పోలీసులు ప్రభుత్వానికి తొత్తులుగా మారి ఎంపీ రేవంత్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టారన్నారు కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ. కేటీఆర్ ఫామ్ హౌస్ పై డ్రోన్ ఎగురవేసినందుకు రేవంత్ రెడ్డిపై పోలీసులు పలు సెక్షన్ ల క్రింద కేసు నమోదు చేయడాన్ని తప్పు బట్టారు. డ్రోన్ ఎగురవేస్తే  188 సెక్షన్ పెట్టి 180  రూపాయల చలానా  వేస్తే సరిపోతుంది.కానీ  రేవంత్ రెడ్డి విషయంలో కఠినమైన సెక్షన్ లు పెట్టి అరెస్ట్ చేశారని ఆయన అన్నారు.

ప్రజల్లో కేటీఆర్ ఫామ్ హౌస్ గురించి  చాలా అనుమానాలు ఉన్నాయని,  వాటిని నివృత్తి చేసే బాధ్యత పోలీసులదీ కాదా అని ప్రశ్నించారు షబ్బీఆర్ అలీ. “మీరు(కేటీఆర్) సక్రమంగా ఫామ్ హౌస్ కట్టి ఉంటే ఎందుకంత ఉలికిపడుతున్నారు.. ప్రాపర్టీ  చూడ్డానికి వెళ్తే ఎలా అరెస్ట్ చేస్తరు?” అని అడిగారు.అనాటి ముఖ్యమంత్రి వైఎస్ పై ఆరోపణలు వస్తే..  ఆయన సీబీఐ విచారణ వేయించుకున్నారని, కేటీఆర్ పై ఆరోపణలు వస్తున్నాయని,  మీరు(కేసీఆర్) మీ కొడుకు పై సీబీఐ విచారణకు సిద్ధమా.? అన్ని అన్నారు.

కేటీఆర్ ఫామ్ హౌస్ విషయాన్ని వెలుగులోకి తెచ్చినందుకు.. తమ కాంగ్రెస్ నేతలను అభినందిస్తున్నట్టు షబ్బీర్  తెలిపారు.  ఉత్తమ్ ఢిల్లీ నుంచి వచ్చాక ఈ విషయంపై కార్యాచరణ రూపొందించి ప్రజల్లోకి ఈ విషయాన్ని విస్తృతంగా తీసుకువెళ్తామన్నారు.

Latest Updates