హెల్మెట్‌ లేదని లారీ డ్రైవర్‌కు జరిమానా

Without-Helmet-fine-to-Lorry-Driver

ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారులకు ఫైన్ విధిస్తున్నారు పోలీసులు. అయితే కొందరు పోలీసులు అతిగా వ్యవహరిస్తున్నారు. రూల్స్ ప్రకారం బైక్ పై వెళ్లే వారు లైసెన్స్ తో పాటు హెల్మెట్ తప్పని సరి. అలాగే కారు డ్రైవింగ్ చేసేవారు తప్పని సరిగా సీటు బెల్ట్ పెట్టుకోవాలి. లేదంటే జరిమానా తప్పదని హెచ్చరిస్తున్నారు పోలీసులు. అయితే కొందరు ట్రాఫిక్ ఫోలీసులు మాత్రం అత్యుత్సాహం ప్రదర్శించారు. హెల్మెట్ లేదంటూ ఓ లారీ డ్రైవర్ కు ఫైన్ విధించారు. దీనికి సంబంధించి నోటీసులు జారీ చేశారు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.

ఉత్తర కన్నడ జిల్లా కార్వార సమీపంలోని దాండేలి నగరంలో 409 వాహన డ్రైవర్‌గా నజీర్‌ ఇంటికి పోలీసులు నోటీసు పంపారు. హెల్మెట్‌ ధరించలేదని రూ.500 జరిమానా చెల్లించాలని నోటీసు పంపారు. పోలీసులు పంపిన నోటీసు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Latest Updates