పేరుకేనా పోలీసు!

పోలీసులు ఎంతో యాక్టివ్​గా, ఎప్పటికప్పుడు అప్​డేటెడ్​గా ఉండాలి. చేతిలో సరికొత్త​ గన్నులు, చిరుత వేగంతో కదలటానికి వెహికిల్స్​, విషయాన్ని క్షణాల్లో చేరవేయటానికి వైర్​లెస్​ డివైజ్​లు, శాటిలైట్​ నెట్​వర్క్​లు.. ఇలా ప్రతిదీ మోడ్రన్​ వెపన్​ అయుండాలి. అప్పుడే క్రిమినల్స్​ని ఈజీగా టాకిల్​ చేయగలరు. ‘లా అండ్​ ఆర్డర్’​ పక్కాగా ఉంటుంది. మరి, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ పోలీసులు ఈ మోడ్రన్​ బాటలో నడుస్తున్నారా? కేంద్రం ఇచ్చే బడ్జెట్​ పూర్తిగా ఖర్చవుతోందా? రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా నిధులు అందిస్తున్నాయా?

‘వీడెవడో చాలా తెలివైనోడు…’ అంటాడు ఓ సినిమాలో క్రైమ్​ ఇన్వెస్టిగేటర్​. పోలీసులను నేరగాళ్లు మించిపోతున్నారు. కేవలం క్రిమినల్​ మెంటాలిటీ ఒక్కటే దీనికి కారణం కాదు, వాళ్లకున్నంత ఇన్ఫర్మేషన్​ టెక్నాలజీ అవగాహన, వాళ్ల దగ్గరున్నన్ని మోడ్రన్​ వెపన్స్​ పోలీసులకు లేవు. నేరస్తులను వెంటాడడానికి తగిన జీప్​లు ఉండవు. స్మార్ట్​ ఫోన్లను క్రిమినల్స్​, టెర్రరిస్టులు తమ టార్గెట్​కోసం వాడుకుంటారు.  పుల్వామాలో సైనిక పటాలం వెళ్తున్న రూట్​ని, వాళ్ల టైమింగ్​ని ట్రేస్​ చేయబట్టే…. ఒకే ఒక్క మిలిటెంట్ ​40 మంది జవాన్లను పొట్టనబెట్టుకోగలిగాడు. ఒకప్పుడు సొసైటీలో  చదువుసంధ్యలు లేనివాళ్లని డాన్​లు, బాస్​లు సెలక్ట్​ చేసుకుని నేర ప్రపంచంలోకి లాగేవాళ్లని, ఇప్పటి పరిస్థితి అలా లేదని సామాజికవేత్తలు అంటున్నారు. ఇన్వెస్టిగేషన్​కి దొరక్కుండా నేరం చేయడమెలా అనే పద్ధతిలో క్రైమ్​ జరుగుతోందని రిటైర్డ్​ పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పెరుగుతున్న క్రైమ్​ రేట్​ని​ తగ్గించటానికి పోలీసులు కొత్త పద్ధతులు కనిపెట్టాలని సూచిస్తున్నారు. సరికొత్త వెపన్లను తెప్పించుకోవాలి. క్రిమినల్స్​ని గంటల వ్యవధిలో పట్టుకోగలగాలి. పోలీసింగ్​ అనేది ఎంత ఫాస్ట్​గా జరిగితే అంతగా నేరం చేయాలనుకునేవాళ్లు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. ‘అమ్మో.. పోలీసు’ అని భయపడతారు. ప్రజలు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటారు.

నరేంద్ర మోడీ రెండోసారి అధికారంలోకి రాగానే ఈ దిశగా ఆలోచనలు మొదలెట్టారు. హోం మంత్రి అమిత్​ షా ఇదే టార్గెట్​తో పనిచేస్తున్నారు. దేశవ్యాప్తంగా ‘లా అండ్​ ఆర్డర్​’ చెక్కుచెదరకుండా చూడాలని మోడీ సర్కారు కోరుకుంటోంది. పోలీసులను మోడ్రన్​ రూట్​లో నడిపించటానికి ఏటా బడ్జెట్​ పెంచుతోంది. 2018–19 బడ్జెట్​తో పోల్చితే 2019–20 బడ్జెట్​లో పోలీస్​ మోడ్రనైజేషన్​ కోసం 8 శాతానికి పైగా బడ్జెటరీ సపోర్ట్​ పెంచింది. దేశంలోని చాలా రాష్ట్రాలు ఈ స్ఫూర్తిని పట్టించుకోవడం లేదు. ‘అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్నట్లుగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. సెంట్రల్​ గవర్నమెంట్ నిధులను పూర్తిగా ఖర్చు చేయట్లేదు. గడచిన ఐదేళ్లుగా ఇలాగే చేస్తున్నాయి. దీంతో చాలా పోలీస్​ స్టేషన్లలో కనీస సదుపాయాలు, పరికరాలు కరువవుతున్నాయి. టెలిఫోన్లు, వైర్​లెస్​ డివైజ్​లు, ట్రాన్స్​పోర్ట్​ వెహికిల్స్​ తదితర ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ లేకపోవటం పోలీసుల పనితీరుపై ప్రభావం చూపుతోంది.

సగం కన్నా తక్కువే ఖర్చు

పోలీస్​ మోడ్రనైజేషన్​లో భాగంగా ఆయుధాల ఆధునీకరణ ఎప్పటికప్పుడు జరగాలి. వైర్​లెస్​ డివైజ్​లు, శాటిలైట్​ నెట్​వర్క్​లు వంటి కమ్యూనికేషన్​ సిస్టమ్స్ తెప్పించుకోవాలి. ల్యాబ్​లు సహా ఫోరెన్సిక్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ను డెవలప్​ చేసుకోవాలి. మ్యాన్​పవర్​కి కమెండో స్ఠాయి ట్రైనింగ్​ ఇప్పించాలి. వీటితోపాటు ఇతరత్రా ఏర్పాట్లు చేసుకోవాలి. వీటికోసం కేంద్రం ఏటా ప్రత్యేకంగా నిధులు ఇస్తోంది. ఆ బడ్జెట్​లో​ కనీసం 50 శాతమైనా ఖర్చు కావడం లేదని ఇండియా స్పెండ్ అనే సంస్థ వెల్లడించింది. దేశంలో పోలీసు మోడ్రనైజేషన్​కోసం కేంద్రం ఇస్తున్న ఫండ్స్​పై ఈ సంస్థ గవర్నమెంట్​ డేటాను అనాలసిస్​ చేసింది.

‘బ్యూరో ఆఫ్​ పోలీస్​ రీసెర్చ్​ అండ్​ డెవలప్​మెంట్’ అందించిన లేటెస్ట్​ డేటా ప్రకారం… 2017 జనవరి నాటికి దేశంలో 267 పోలీస్​ స్టేషన్లలో టెలిఫోన్లు, 129 పోలీస్​ స్టేషన్లలో వైర్​లెస్​ కమ్యూనికేషన్​ డివైజ్​లు లేవు. సాయం కోరుతూ ప్రజలు ఫోన్​ చేస్తే వెళ్లటానికి పోలీసులకు తగినన్ని వాహనాలు లేవు. ప్రతి వంద మంది పోలీసులకు కేవలం 8 వాహనాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. పెట్రోలింగ్​, ‘లా అండ్​ ఆర్డర్​’ మెయింటెనెన్స్​కి కూడా ఈ వెహికిల్సే దిక్కవుతున్నాయి. 2017 ప్రారంభం నాటికి దేశవ్యాప్తంగా 273 పోలీస్​ స్టేషన్లలో కనీసం ఒక్క​ ట్రాన్స్​పోర్టేషన్​ వెహికిలైనా​ లేకపోవటం దారుణం.

మోడ్రనైజేషన్​ బడ్జెట్​తో పీపుల్​ ఫ్రెండ్లీ పోలీస్​ స్టేషన్లను, పోలీస్​ పోస్టులను నిర్మించుకోవాలి. పోలీస్​ మొబిలిటీని పెంచాలి. వెపన్లు, కమ్యూనికేషన్​ ఎక్విప్​మెంట్​ తెప్పించుకోవాలి. 2017కు ముందు ఐదేళ్లలో ఈ మేరకు మొత్తం రూ.28,703 కోట్లు విడుదల చేయగా, అందులో 48 శాతం (రూ.13,720 కోట్లు) మాత్రమే ఖర్చు చేశారు. ఈ విషయంలో అన్ని రాష్ట్రాలతో పోల్చితే నాగాలాండ్​ చాలా బెటర్​ పొజిషన్​లో ఉంది. ఆ రాష్ట్రం తమకు కేటాయించిన మొత్తం రూ.1,172 కోట్లు వాడేసి ఆదర్శంగా నిలిచింది. చాలా రాష్ట్రాల్లో కమ్యూనికేషన్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ మోడ్రనైజేషన్​ అసంపూర్తిగా మిగిలిపోయింది.

రాష్ట్రాలవారీగా పరిస్థితి ఎలా ఉందంటే?

మణిపూర్​, జార్ఖండ్​, మేఘాలయల్లోని సగానికిపైగా పోలీస్​ స్టేషన్లలో వైర్​లెస్​ కమ్యూనికేషన్​ డివైజ్​లు లేవు. ఈ మూడు రాష్ట్రాల్లో క్రైమ్​ రేట్​ ప్రతి లక్ష మందికి 120కి పైనే నమోదవుతోంది. ఉత్తరప్రదేశ్​, బీహార్​, పంజాబ్​లలో 45 శాతానికి పైగా పోలీస్ స్టేషన్లలో టెలిఫోన్లు లేవు. ఫలితంగా బీహార్​లో అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువగా క్రైమ్​ రేట్​ (157.4) ఉంది.  పంజాబ్​లో 137గా, యూపీలో 128.7గా నమోదైంది. కమ్యూనికేషన్​ డివైజ్​లు లేని పోలీస్​ స్టేషన్ల సంఖ్య 2012తో పోల్చితే 2017 నాటికి పది శాతం తగ్గడం ఒక్కటే కాస్త రిలీఫ్​నిస్తోంది. 2016 చివరి నాటికి దేశవ్యాప్తంగా 273 పోలీస్​ స్టేషన్లలో ట్రాన్స్​పోర్టేషన్​ ఫెసిలిటీ ఉండేది కాదు. ఇందులో 90 శాతం పోలీస్​ స్టేషన్లు మావోయిస్టుల కార్యకలాపాలు చోటు చేసుకునే ఛత్తీస్​గఢ్​లోనే ఉండటం ఆందోళన కలిగించే అంశం. ఇలాంటి పోలీస్​ స్టేషన్లు తెలంగాణలో 91, మణిపూర్​లో 25 వరకు ఉన్నాయి. మైన్​–ప్రూఫ్​ వెహికిల్స్​, ఫోరెన్సిక్​ వ్యాన్లు, ప్రిజన్​ ట్రక్కులు, వాటర్​ ట్యాంకర్లు, కార్లు, జీపులు తదితర వాహనాలు పోలీస్​ సిబ్బందికి సరిపోను సంఖ్యలో లేవు. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. వైట్​ కాలర్​ క్రిమినల్స్​ అంటే ఒకప్పుడు చేతి మడత నలగకుండా, కాలర్​కి మట్టి అంటకుండా తప్పులు చేసేవాళ్లని అర్థం. ఇప్పుడు దేశంలో ఎక్కడో ఉండి, ఇక్కడ నేరాలు ఘోరాలకు పాల్పడేవాళ్లందరూ వైట్​ కాలర్​ క్రిమినల్స్​ అనే చెప్పాలి.

డిమాండ్​కు తగ్గట్లు లేని వెపన్లు

  • వివిధ రాష్ట్రాల్లో పోలీసు బలగాలు మోడ్రన్​ వెపన్లకు బదులు మామూలు ఆయుధాలు, పాతకాలంనాటి వాకీటాకీ తరహా కమ్యూనికేషన్స్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​తోనే నెట్టుకొస్తున్నట్లు కంప్ట్రోలర్​ అండ్​ ఆడిటర్​ జనరల్​ (కాగ్​) పరిశీలనలో తేలింది. ఈ సంస్థ 2014–18 మధ్య ఐదు రాష్ట్రాల్లో స్టడీ చేసి రిపోర్ట్​ ఇచ్చింది. దాని ప్రకారం..
  • యూపీ​లో 48 శాతం మంది పోలీసులు 20 ఏళ్ల క్రితమే ఔట్​డేటెడ్​ అయిన వెపన్లను వాడుతున్నారు.
  • రాజస్థాన్​లో పోలీసులకు 15,884 వెపన్లు అవసరం కాగా, వారికి 3,962 వెపన్లు మాత్రమే తెప్పించారు. అందులో 2,350 వెపన్లు స్టోర్​కే పరిమితమయ్యాయి. వాటిని కనీసం డిస్ట్రిబ్యూట్​ కూడా చేయలేదు. దీన్నిబట్టి ఆ రాష్ట్రంలో 85 శాతానికిపైగా వెపన్స్​ షార్టేజీ నెలకొంది.
  • పశ్చిమ బెంగాల్​లో కావాల్సిన వెపన్స్​ కన్నా 71 శాతం తక్కువ వెపన్స్​ ఉన్నాయి.
  • కర్ణాటకలో 37 శాతం, గుజరాత్​లో 36 శాతం ఆయుధాల కొరత ఉంది.

police forces must update with modern weapons, communication devices for law and order

Latest Updates