కోడ్ లాంగ్వేజీ ద్వారా డ్రగ్ డీలింగ్

కోడ్ లాంగ్వేజీ ద్వారా డ్రగ్ డీలింగ్

హైదరాబాద్: డ్రగ్స్ సప్లై వ్యవహారంలో కునాల్, వంశీధర్ రావుల పాత్ర ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలినట్టు సమాచారం. కునాల్ కు డ్రగ్స్ పెడలర్లతో లింకులు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మూడో వ్యక్తికి అర్థంకాకుండా పక్కాగా కోడ్ లాంగ్వేజ్ వాడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బ్రో, స్టఫ్, సోడా, కూల్ వంటి కోడ్ పదాలు వాడినట్లు పోలీసుల విచారణలో తేలింది. పోలీసులు పబ్ లోకి రాగానే డ్రగ్ సేవిస్తున్న వారిని కునాల్ అనే వ్యక్తి కోడ్ లాంగ్వేజీ ద్వారా అలెర్ట్ చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 142మంది పబ్ లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వారి జాబితాను రిలీజ్ చేశారు. కాగా.. అందులో ఎంతమందికి డ్రగ్స్ ముఠాతో సంబంధం ఉంది, డ్రగ్స్ ఎవరు సరఫరా చేశారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. 

మరిన్ని వార్తల కోసం..

పబ్‎లో ప్రముఖులు.. లైవ్ అప్‎డేట్స్

డ్రగ్స్‌ వ్యవహారం.. బంజారాహిల్స్ సీఐ సస్పెన్షన్