డబుల్ బెడ్రూం ఇళ్ల పేరుతో టోకరా..ముఠా అరెస్ట్

డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తామని మోసం చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు. ఏ ఆర్ శ్రీనివాస్., వెస్ట్ జోన్ డీసీపీ వివరాల ప్రకారం..డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇప్పిస్తానని మోసాలకు పాల్పడుతున్న నలుగురు ని అరెస్ట్ చేశామన్నారు. నిందితులలో ఏ1 శేరియర్ ఆలీ పరారీలో ఉన్నాడని చెప్పారు. ఇతను  జీహెచ్ఎంసి లో పని చేస్తున్నాడన్నారు.  ఈ మూఠా రూ. 15 లక్షల వరకు అమాయకుల దగ్గర డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామని డబ్బులు వసూలు చేశారని తెలిపారు. 75 మంది దగ్గర ఒక్కొక్కరి నుంచి రూ.15-18 వేల వరకు వసూలు చేశారన్నారు. టీఆర్ఎస్ పార్టీ టోకెన్స్, జీహెచ్ఎంసి ఫేక్ లెటర్ హెడ్స్ తో అమాయకులను మోసం చేశారన్నారు. నిందితుల నుంచి 10 ఫేక్ టిఆర్ఎస్ పార్టీ టోకెన్స్, ఫేక్ డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు.ఇలాంటి మోసగాళ్లు ఎవరైనా వస్తే తమకు ఫిర్యాదు చేయాలని కోరారు.

see more news

సిద్దిపేట కాల్పుల్లో ట్విస్ట్..ఆ తుపాకులు పోలీసులవే

హైదరాబాద్ లో బ్రిడ్జిపై నుంచి పడ్డ కారు..ఒకరు మృతి

క్రికెట్ గాడ్ సచిన్ కు మరో ప్రతిష్టాత్మక అవార్డ్

Latest Updates