శ్రావణి కేసులో పోలీసుల ట్విస్ట్..A1గా దేవ్ రాజ్

టీవీ నటి శ్రావణి ఆత్మ హత్య కేసు రిమాండ్ రిపోర్ట్ లో  కొత్త ట్విస్ట్ ఇచ్చారు పోలీసులు.  రిమాండ్ రిపోర్ట్ లో A1 గా దేవరాజ్ రెడ్డి, A2 గా సాయి కృష్ణ రెడ్డి, A3 గా అశోక్ రెడ్డిని చేర్చారు.  ప్రెస్ మీట్ లో A3 గా దేవ్ రాజ్ పేరు చెప్పారు. కేసులో 17 మంది సాక్షులను విచారించారు పోలీసులు . దేవ్ రాజ్, సాయి కృష్ణ, అశోక్ రెడ్డిల వేదింపులు తట్టుకోలేక శ్రావణి ఆత్మహత్య చేసుకుంది. దేవ్ రాజ్, సాయి కృష్ణ లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు. A3 అశోక్ రెడ్డి పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సెప్టెంబర్ 7న అజీజ్ నగర్ షూటింగ్ లొకేషన్ నుంచి శ్రావణిని  తీసుకెళ్లాడు దేవరాజ్ . ఇద్దరూ కలిసి పంజాగుట్ట శ్రీకన్య హోటల్ కి వెళ్లారు. శ్రీకన్య హోటల్ కు చేరుకున్న సాయి కృష్ణ రెడ్డి శ్రావణిని కొట్టి ఆటోలో తీసుకెళ్లాడు.  దేవ్ రాజ్ తో కలవకూడదని శ్రావణిని బెదిరించారు.  సాయి, అశోక్ రెడ్డి.  హైదరాబాద్ వదిలి వెళ్లిపోదామని దేవ్ రాజ్ ను కోరింది శ్రావణి . శ్రావణి తో పారిపోయి పెళ్లిచేసుకోవడానికి ఒప్పుకోలేదు దేవ్ రాజ్. దేవ్ రాజ్, సాయి కృష్ణ, అశోక్ రెడ్డిల వేదింపులు తట్టుకోలేక శ్రావణి ఆత్మహత్య చేసుకుంది.

Latest Updates