కొడంగల్ లో గిరిజనులను చితకబాదిన పోలీసులు

ఇసుక రవాణా చేస్తున్నారంటూ ఇద్దరు గిరిజన యువకులను పోలీసులు లాఠీలతో చితకబాదారు. కొడంగల్ మండలం చిట్లపల్లి అనుబంధంగా ఉన్న పోషమ్మ తండాకు చెందిన కాశీరామ్, తులసీరామ్ సోదరులు.ఇసుక రవాణా చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. కానిస్టేబుల్స్ ప్రవీణ్ రెడ్డి, శ్రీనివాస్ తదితరులు అదే రాత్రి తండా పరిసరాలకు చేరుకుని ఇసుక ట్రాక్టర్ నుపట్టుకున్నారు. తమ ట్రాక్టర్ ను ఎందుకు అడ్డుకుంటారని ఆ సోదరులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య
వాగ్వాదం చోటు చేసుకుంది. ఆగ్రహంతో ఊగిపోయిన కానిస్టేబుల్స్ ఇద్దరు యువకులపై విరుచుకుపడ్డారు. అక్కడి నుంచి వారిని ఠాణాకు తీసుకువెళ్లి రాత్రి తీవ్రంగా కొట్టారు. మంగళవారం ఉదయం తండావాసులు స్టేషన్ కు వచ్చి తీవ్రంగా గాయపడిన యువకులను కొడంగల్ సర్కా ర్ దవాఖానా కు తరలించారు. గిరిజనులు వెళ్లి సంఘటన గురించి ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి మొరపెట్టుకున్నారు. బాధితులను ఆసుపత్రిలో పరామర్శించిన ఎమ్మెల్యే బాధ్యు లైన పోలీసులపై చర్య తీసుకుంటామని హామీ ఇచ్చారు.

డ్యూటీ కానిస్టేబుళ్లపై చేయి చేసుకున్నారు

ఇసుక అక్రమ రవాణా సమాచారం తెలియగానే మా కానిస్టేబుల్స్ తండాకు వెళ్లి ట్రాక్టర్ ను పట్టుకున్నారు. డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ ప్రవీణ్ రెడ్డి కాలర్ పట్టుకుని చేయి చేసుకున్నారు. ఇందులో ఎలాంటి దురుద్ధేశం లేదు.ఇసుక రవాణా చేసి నందున, విధి నిర్వహణలో ఉన్న సిబ్బందిపై చేయి చేసుకున్నందున కేసు నమోదు చేశాం . నిబంధనలకు విరుద్ధంగా ఎవరూ వ్య వహరించరాదు.
– సీఐ నా గేశ్వరరావు, కొడంగల్ సర్కిల్

Latest Updates