సుశాంత్ అకౌంట్ నుంచి రియా అకౌంట్ కి రూ. 15 కోట్లు ట్రాన్స్ ఫర్

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసు కీలక మలుపు తిరిగింది. సుశాంత్ బ్యాంక్ అకౌంట్ నుంచి రియా అకౌంట్ కు రూ. 15 కోట్లు ట్రాన్స్ ఫర్ అయినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా.. రియా యూరోప్ టూర్ లో ఉన్నప్పుడు సుశాంత్ క్రెడిట్ కార్డు కూడా వాడినట్లు పోలీసులు గుర్తించారు. అదే విధంగా సుశాంత్ కంపెనీలో రియాకు షేర్లు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సుశాంత్ బాడీగార్డులలో ఒకరిని రియా తొలగించినట్లు పోలీసులు విచారణలో తేల్చారు. అంతపెద్ద మొత్తంలో డబ్బులు ఎందుకు ట్రాన్స్ ఫర్ అయ్యాయో అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా.. రియాను విచారించేందుకు బీహార్ నుంచి ఒక ప్రత్యేక టీం ముంబైకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బాంద్రా పోలీసులు ఈ కేసు గురించి రియాను గతంలోనే విచారించారు. సుశాంత్ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు రియాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రియాతో పాటు మరో ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసుకు సంబంధించి ముంబై పోలీసులు రియాను విచారణ చేయనున్నారు. బాలీవుడ్ భామ కంగనా రనౌత్ ఇప్పటికే సుశాంత్ ఆత్మహత్యకు సంబంధించి పలువరిపై విమర్శలు చేసింది.

For More News..

దేశంలో 15 లక్షల మార్క్ దాటిన కరోనా కేసులు

విద్యార్థుల ఆన్‌లైన్ క్లాసుల కోసం ఫ్రీగా స్మార్ట్‌ఫోన్లు

మలేషియా మాజీ ప్రధానికి 12 ఏండ్ల జైలుశిక్ష

Latest Updates