పోలీసుల ప్రశ్నలతో అఖిలప్రియ ఉక్కిరిబిక్కిరి

పోలీసు కస్టడీలో భాగంగా అఖిల ప్రియను రెండోరోజు విచారిస్తున్నారు పోలీసులు.  బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్లో అఖిల ప్రియ విచారణ జరుపుతున్నారు. కిడ్నాప్ కేసులో తన ప్రమేయం లేదని చెప్తున్నారు అఖిల ప్రియ. ఇవాళ్టి విచారణలో కాల్స్ లిస్టులు ముందుంచి ప్రశ్నిస్తున్నారు పోలీసులు.  సెల్ ఫోన్ సిగ్నల్స్,  టవర్ లొకేషన్స్ ఆధారాలు చూపించి  ప్రశ్నల  వర్షం  కురిపిస్తున్నారు.  మొదటి  రోజు  విచారణలో  భర్త భార్గవ్ రామ్ ఆచూకీ కోసం ప్రశ్నించారు పోలీసులు. కిడ్నాప్ కు సహకరించిన నిందితుల వివరాలపై ఆరా తీశారు.

బోయిన్ పల్లి కిడ్నాప్  కేసులో ఇప్పటి వరకు మొత్తం నలుగురు అరెస్ట్  అయ్యారు. ప్రధాన సూత్రధారి అఖిలప్రియతో పాటు మరో ముగ్గుర్ని అరెస్ట్ చేశారు. మరోవైపు కిడ్నాప్ కేసులో కీలకంగా వ్యవహరించిన.. భార్గవ్ రామ్, గుంటూరు శ్రీనుల కోసం పోలీసుల గాలిస్తున్నారు. కిడ్నాప్ కేసులో మొత్తం 19 మంది ప్రమేయమున్నట్లు తేల్చారు పోలీసులు. భార్గవ రామ్, గుంటూరు శ్రీను పథకం ప్రకారం కిడ్నాప్ చేశారని….. కీలక ఆధారాలు సేకరించారు. నిందితులు ఉపయోగించిన సెల్ ఫోన్లు, కార్లు స్వాధీనం చేసుకున్నారు. కిడ్నాపర్లతో అఖిల ప్రియ టచ్ లో ఉన్నట్లు ఆధారాలు కూడా సేకరించారు పోలీసులు.

Latest Updates