గర్భిణి ప్రాణాలు కాపాడిన సిద్దిపేట కానిస్టేబుల్

అత్యవసర పరిస్థితిలో ఉన్న గర్భిణిని ప్రాణాలు కాపాడి  రియల్ హీరో అనిపించుకున్నాడు ఓ కానిస్టేబుల్.  జనవరి 2న  సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ కేసులో అత్యవసరంగా B పాజిటివ్ బ్లడ్ కావాల్సి ఉండగా.. సిద్దిపేట కానిస్టేబుల్ శ్రీశైలం వెంటనే స్పందించి రక్తదానం చేశారు. దీంతో ఆ గర్భిణీకి ప్రమాదం తప్పింది. ఈ విషయాన్ని  కమిషనర్ ఆఫ్ పోలీస్ సిద్దిపేట ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. గర్భిణీ ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ ను డీజీపీ మహేందర్ రెడ్డి ట్విట్టర్లో అభినందించారు.  ట్వీట్ ను  రీ ట్వీట్ చేసిన మహేందర్ రెడ్డి.. పోలీస్ అంటేనే సామాజిక సేవని మరోసారి నిరూపించిన కానిస్టేబుల్  శ్రీశైలంకు మనస్ఫూర్తిగా కంగ్రాట్స్ తెలిపారు.

Latest Updates