వాహనాలపై పోలీసు పేరు ఉంటే సీజ్

సికింద్రాబాద్,వెలుగు: చట్టం ప్రకారం వాహనాలపై పోలీస్ అని వ్రాసి ఉంటే అలాంటి వాహనాలను సీజ్ చేసి చలాన్స్ విధిస్తున్నారు సిటీ ట్రాఫిక్ పోలీసులు. నగర సీపీ ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ తో నార్త్ జోన్ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్యాట్నీ సెంటర్,ఆర్పీ రోడ్డు తదితర ప్రాంతాలల్లో మంగళవారం,బుధవారం పలు వాహనాలను తనిఖీ చేసి సీజ్ చేసి చలాన్స్ విధించినట్లు ఎస్ ఐ కనకయ్య,రాంచందర్ నాయక్ లు తెలిపారు.చట్ట ప్రకారం వాహనాలపై పోలీస్ అని వ్రాసుకోవద్దని,అలా వ్రాసుకొని వాహనాలను తిప్పితే వాహనాలను సీజ్ చేసి చలాన్స్ విధిస్తున్నామని తెలిపారు.అలా సీజ్ చేసిన వాహనదారులకు కౌన్సెలింగ్ ఇచ్చి పెండింగ్ చలాన్స్ చెల్లించిన తర్వాత వెహికిల్స్ ఇస్తామని పోలీసులు తెలిపారు.

Latest Updates