మహిళా పోలీస్ కు నిప్పంటించిన పోలీస్

police-officer-hacked-burnt-alive-near-her-home-in-kerala-traffic-cop-taken-into-custody

అలప్పుజ (కేరళ): డ్యూటీ ముగించుకుని స్కూటీపై ఇంటికి వెళ్తున్న ఓ మహిళా పోలీస్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌ను కారుతో ఢీకొట్టిన మరో పోలీసు అధికారి.. ఆమెపై పెట్రోలు పోసి నిప్పట్టించాడు. తీవ్రంగా గాయపడిన బాధిత మహిళ ఘటనా స్థలంలోనే చనిపోయింది. నిందితుడు 40 శాతం కాలిన గాయాలతో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. శనివారం కేరళలోని అలప్పుజ జిల్లాలో ఈ ఘటన జరిగింది.

సౌమ్య పుష్పకరన్‌‌‌‌ (34).. మావేలిక్కర పరిధిలోని వల్లిక్కున్నమ్ పోలీస్‌‌‌‌స్టేషన్‌‌‌‌లో సివిల్‌‌‌‌ పోలీస్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌ (సీపీఓ)గా పని చేస్తున్నారు. శనివారం సాయంత్రం డ్యూటీ ముగించుకుని టూ వీలర్​పై ఇంటికి వెళ్తుండగా, దారి కాచిన అజాస్‌‌‌‌ అనే మరో పోలీసు అధికారి కారుతో ఆమెను ఢీ కొట్టాడు. తర్వాత సౌమ్యపై దాడి చేశాడు. ఆమె తప్పించుకుని పారిపోతుండగా, పట్టుకుని పెట్రోల్‌‌‌‌ పోసి నిప్పంటించాడు. దీంతో సౌమ్య ఘటనాస్థలిలోనే మృతి చెందారు. అజాస్‌‌‌‌కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
దాడికి కారణాలు తెలియరాలేదని చెప్పారు.

Latest Updates