సోదాల పేరుతో పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నరు

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ గాంధీనగర్ లో పోలీసుల తీరుపై మండిపడుతున్నారు కాంగ్రెస్ లీడర్లు. పోలీసులు కావాలనే కాంగ్రెస్ నాయకుల ఇళ్లను టార్గెట్ చేసుకుని బెదిరింపులకు దిగుతున్నారని.. ఇళ్లలో సోదాల పేరుతో ఓవరాక్షన్ చేస్తున్నారని ఆరోపించారు. అధికార పార్టీకి తొత్తులుగా మారారని మండిపడ్డారు. చాలా చో ట్ల కాంగ్రెస్ నాయకులు.. పోలీసులతో గొడవకు దిగారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు.. పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.

10 వ వార్డులో పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారని, గోడలు దూకి మరి నేతల ఇళ్లలోకి ప్రవేశించడం ఎంతవరకూ కరెక్టని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. పోలీసులు మాత్రం తమ పని తాము సైలెంట్ గా చేసుకుంటున్నామని, చెకింగ్ లకు తమకు సహకరించాలని అంటున్నారు. ఏదేమైనా మరికొన్ని గంటల్లో ఎన్నికలు జరగబోతుండడంతో పలు ప్రాంతాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Latest Updates