పోలీస్ ఫిజికల్ టెస్ట్: ప్రాక్టీస్ చేస్తూ యువకుడు మృతి

రంగారెడ్డి: కానిస్టేబుల్ ఫిజికల్ టెస్ట్ పరీక్షకు ప్రాక్టీస్ చేస్తూ ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో ఇవాళ ఉదయం జరిగింది. మృతుడు ఇబ్రహీంపట్నం మండలం మేటిక గ్రామవాసి ఏకాంబరం(23)గా గుర్తించారు. త్వరలో జరగనున్న కానిస్టేబుల్ ఫిజికల్ టెస్ట్ కోసం ఉదయం గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేస్తుండగా ఏకాంబరానికి గుండెనొప్పి వచ్చింది. దీంతో అక్కడే కుప్పకూలిపోయి మృతి చెందాడని తెలిపారు పోలీసులు. కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తాన్నామన్నారు.

Latest Updates