రిషీ కపూర్ భౌతికకాయాన్ని ఇంటికి తీసుకెళ్లొద్దు: ముంబై పోలీసులు

బాలీవుడ్ దిగ్గజం రిషీ కపూర్ ఇవాళ(గురువారం) ఉదయం 8.45 గంటలకు తుది శ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలకు ముంబైలో  ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు ముంబై మహానగరాన్ని కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ క్రమంలో… రిషీ కపూర్ అంతిమ సంస్కారాలకు సంబంధించి ముంబై పోలీసులు పలు సూచనలు చేశారు.

ఆసుపత్రి నుంచి రిషీ భౌతికకాయాన్ని ఇంటికి తీసుకెళ్లరాదని… నేరుగా శ్మశానానికి తీసుకెళ్లాలని సూచించారు. అంత్యక్రియలకు పెద్ద సంఖ్యలో జనాలు హాజరు కాకూడదని చెప్పారు. దీంతో కుటుంబ సభ్యుల మధ్యే రిషీ అంత్యక్రియలు పూర్తికానున్నాయి. చందన్ వాడి శ్మశానవాటికలో ఈ సాయంత్రం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.

Latest Updates