రియల్ హీరోస్..15 మందిని కాపాడిన ములుగు పోలీసులు

వాగుల్లో చిక్కుకున్న15 మంది భక్తుల్ని కాపాడి రియల్ హీరోలు  అనిపించుకున్నారు  ములుగు పోలీసులు.  భారీ వర్షాలకు పసర – మేడారం ప్రాజెక్ట్ నగర్ దగ్గర  వాగులు  పొంగిపోర్లుతున్నాయి. అయితే మేడారం దర్శించుకొని తిరుగు ప్రయాణమైన 15 మంది భక్తులు అక్కడ చిక్కుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న  ములుగు డీఎస్పీ, పసర సీఐ రిస్క్ టీమ్ ఆధ్వర్యంలో కాపాడారు. ఒక్కొక్కరిని వాగు దాటించారు. చిన్న పిల్లల్ని తమ భుజాలపై ఎత్తుకుని వాగు దాటించడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.

Latest Updates