లాడ్జిలో ప్రియురాలిపై దాడి ఎందుకు చేశాడంటే..?

హైదరాబాద్ చైతన్యపురి పీఎస్ పరిధిలోని ఓ లాడ్జ్ లో యువతిపై యువకుడి దాడి ఘటనలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. యువతి గొంతుకోసి.. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు యువకుడు వెంకటేశ్వర్లు.

కేసు వివరాలను ఎల్బీనగర్ ఏసీపీ పృథ్వీరావు వివరించారు. “ఉదయం 11 గంటల తర్వాత చైతన్యపురిలోని ఓ లాడ్జిలో వెంకటేశ్వర్లు అనే వ్యక్తి.. బాధితురాలిపై కత్తితో దాడి చేశాడు. ప్లాన్ ప్రకారం వెంటేశ్వర్లు ఈ  దాడి చేశాడు. దిల్ సుఖ్ నగర్ లోని ఓ కోచింగ్ సెంటర్లో ఇద్దరికి పరిచయం అయింది. ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. ప్రెండ్షిప్ కాస్తా ప్రేమగా మారింది. అయితే మనస్వని ఇతర వ్యక్తులతో క్లోజ్ గా తిరగడం వెంకటేశ్వర్లుకు నచ్చలేదు. మనస్వినిపై వెంకటేశ్వర్లు పగ పెంచుకున్నాడు. ప్లాన్ ప్రకారం చంపాలని స్కెచ్ వేశాడు. మనస్వినిపై కత్తితో దాడి చేశాడు. ఆ తర్వాత తాను కూడా కత్తితో ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు. ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగానే ఉంది. వెంకటేశ్వర్లుపై అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం.” అన్నారు ఏసీపీ.

Read Also : లాడ్జికి పిలిచి ప్రియురాలి గొంతుకోశాడు

Latest Updates