
హైదరాబాద్: బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో అరెస్టైన భూమా అఖిలప్రియపై పోలీసులు నమోదు చేసిన కేసులో మార్పులు చేశారు. A-2 గా ఉన్న అఖిల ప్రియను A-1గా పేర్కొన్నారు. హఫీజ్‌పేట్ భూ వివాదంలో ఆమే సూత్రధారి అని తేల్చారు. A-1 అఖిలప్రియ, A-2 ఏవీ సుబ్బారెడ్డి, A-3 భార్గవ్‌రామ్ మరియు నిందితులుగా శ్రీనివాసరావు, సాయి, చంటి, ప్రకాశ్ పేర్లు నమోదు చేశారు.
ప్రాథమిక వివరాల ప్రకారం.. హఫీజ్‌పేట సర్వే నం.80లో 2016లో 25 ఎకరాల భూమిని ప్రస్తుతం బాధితులుగా చెప్పబడుతున్న ప్రవీణ్ రావ్ సోదరులు భూములు కొన్నారు. అయితే ఆ భూమి తమదేనని అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి, భార్గవ్‌రామ్ వాదించగా.. ఏవీ సుబ్బారెడ్డికి ప్రధాన బాధితుడైన ప్రవీణ్‌రావు డబ్బులిచ్చి సెటిల్ చేసుకున్నారు. అయితే ప్రస్తుతం భూమి ధర పెరగడంతో నిందితులు సమస్యలు సృష్టించారు. ఇంకా డబ్బులు కావాలని నిందితులు డిమాండ్ చేశారని పోలీసులు తెలిపారు.