అసెంబ్లీ సమావేశాలకు పోలీసుల భారీ బందోబస్తు..!

హైదరాబాద్: అసెంబ్లీ ముందు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. గురువారం పొద్దున మొదలైన అసెంబ్లీ సమావేశాలకు ఎటువంటి ఆటంకం కలుగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఇందులో సివిల్ పోలీసులతో పాటు టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా భద్రతా చర్యలలో పాల్గొన్నారు. నిన్న ఏబీవీపీ విద్యార్థులు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించడం.. ఈ రోజు ఆషా వర్కర్లు అసెంబ్లీని ముట్టడిస్తారనే సమాచారంతో భారీ భద్రతను ఏర్పాట్లు చేశారు పోలీసులు. అయితే పొలీస్ లాఠీలు కాకుండా కట్టెలు పట్టుకుని అసెంబ్లీకి సెక్యురిటీని ఇస్తున్నారు పోలీసులు.

Latest Updates