కరోనా వీడియో: లాఠీలకు శానిటైజర్లు పూసి మరీ కొడుతున్నరు

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. అయినా కూడా జనం లాక్‌డౌన్‌ను పట్టించుకోకుండా రోడ్లపైకి వస్తూనే ఉన్నారు. దాంతో అటు ప్రధాని, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలు బయటకు రాకుండా చూడాలని పోలీసులను ఆదేశించారు. దాంతో పోలీసులు జనాన్ని రోడ్ల మీదకు రాకుండా చేయడానికి కొంచెం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. అనవసరంగా రోడ్ల మీదికి వచ్చిన వాళ్లను పోలీసులు ఆపుతున్నారు. రోడ్డు మీదకు రావడానికి గల కారణం ఏంటో ఆరాతీస్తున్నారు. సరైన కారణం ఉంటే వారిని అక్కడి నుంచి పంపిస్తున్నారు. లేకపోతే బండి ఆపి ఫైన్ లేదా కేసు నమోదు చేస్తున్నారు. కొన్ని చోట్ల బండి సీజ్ కూడా చేస్తున్నారు. అయితే ఈ తనిఖీలలో చాలామంది యువకులు పోలీసులకు ఎదురుతిరిగి విసిగిస్తున్నారు. దాంతో పోలీసులు లాఠీలకు కూడా పని చెప్పాల్సి వస్తుంది. దేశంలో అక్కడక్కడా పోలీసులు అటువంటి వారిపట్ల కాస్త కటువుగానే ప్రవర్తిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో కూడా పోలీసులు కొంతమందిని కొట్టిన సంఘటనలు కూడా జరిగాయి. అయితే ప్రజలు పోలీసుల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాజకీయ నాయకులకు మరియు పోలీసు అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. దాంతో మీ ఆరోగ్యం కోసం చేస్తున్న ఈ లాక్‌డౌన్‌ను అందరూ పాటించాలని అటు నాయకులు, ఇటు పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు. అందరూ పోలీసులకు సహకరించాలని కోరుతున్నారు.

కాగా.. పోలీసులు లాఠీలకు శానిటైజర్ పూసి శుభ్రం చేస్తున్న ఒక వీడియోను వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. లాక్‌డౌన్‌ను పట్టించుకోకుండా రోడ్లపైకి వచ్చిన వాళ్లని కొట్టిన తర్వాత మళ్లీ పోలీసులు శానిటైజర్‌తో క్లీన్ చేస్తున్నారని రాంగోపాల్ ట్వీట్ చేశాడు. ఆ వీడియో చూసిన వాళ్లంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

For More News..

కరోనా అలర్ట్: రోగనిరోధక శక్తి పెరగడానికి పాటించాల్సినవి ఇవే..

‘ఓనర్లు ఇంటి అద్దె అడగొద్దు’

పరీక్షలు లేకుండా పైతరగతులకు పంపే యోచనలో ప్రభుత్వం

డీఎస్పీపై కేసు నమోదు.. ఫారెన్ నుంచి వచ్చిన కొడుకు విషయం దాచినందుకే..

Latest Updates