పోలీస్ వెహికల్​తో యువకులు హల్​చల్​

ఎల్ బీ నగర్,వెలుగు : పోలీస్ వెహికల్  నడుపుతూ కొందరు యువకులు అర్దరాత్రి హల్ చల్ చేసిన ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. హైదరాబాద్ సిటీ పోలీస్ కు చెందిన ఏపీ09పీబీ0067నంబర్ గల పోలీస్ వెహికల్ ను శుక్రవారం అర్ధరాత్రి కొందరు యువకులు ర్యాష్ గా డ్రైవ్ చేస్తూ సైరన్ లతో బీభత్సం సృష్టించారు. వారికి ఎదురుగా ఏ వెహికల్ వచ్చినా సైరన్ మోగించారు. ఈ తతంగాన్ని అంతా సెల్ ఫోన్ లో చిత్రీకరించిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ  పోలీస్ వెహికల్ లో ఉన్నవారంతా మైనర్లుగా తెలుస్తుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో ఈ వెహికల్ ఏ అధికారికి కేటాయించిందో తెలుసుకునేందుకు పోలీసులువ విచారణ చేశారు.

సిటీ ఈస్ట్ జోన్ కంట్రోల్ రూమ్ లో పనిచేస్తున్న ఇన్ స్పెక్టర్ శంకర్ నాయక్ కు కేటాయించిన వెహికల్ గా తెలుస్తోంది. కంట్రోల్ రూమ్ లో విధులు నిర్వహిస్తున్న శంకర్ నాయక్ వనస్థలిపురం పీఎస్ పరిధిలోని ఇంజాపూర్ లో ఉంటున్నాడు. శుక్రవారం డ్యూటీ అయిపోగానే ఇంటికి వచ్చిన సీఐ శంకర్ నాయక్ తన వెహికల్ ను ఇంటి ముందున్న పార్కింగ్ ప్లేస్ లో పెట్టాడు. ఈ వెహికల్ ను ఆయన కుమారుడు తీసుకుని తన ఫ్రెండ్స్ తో ఎల్ బీనగర్, వనస్థలిపురం ప్రాంతాల్లో తిరిగినట్టు సమాచారం. పోలీస్ వెహికల్ లో యువకులు హల్ చల్ చేసిన తీరును స్థానికులు తప్పుపడుతున్నారు.

Latest Updates