పోలీస్ వాహ‌నం బోల్తా.. ఎస్ ఐ మృతి

జనగామ జిల్లా: బొలెరో(పోలీస్) వాహనం బోల్తాపడి RSI మృతి చెందిన సంఘ‌ట‌న ఆదివారం జ‌న‌గామ జిల్లాలో జ‌రిగింది. ఆదివారం ఉద‌యం వ‌రంగ‌ల్ నుండి హైద‌రాబాద్ కు బొలెరో పోలీసు వాహ‌నంలో వెళ్తుండ‌గా పెంబర్తి గ్రామ శివారులో ప్ర‌మాద‌వ‌శాత్తు వాహ‌నం బోల్తా ప‌డింది. దీంతో వరంగల్ PTCకి చెందిన RSI కర్ణుడు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకుని వివ‌రాలు సేక‌రిస్తున్నారు. ప్రమాదానికి అతివేగమే కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Latest Updates