దిశ కేసులో నిందితులకు ఏడు రోజుల కస్టడీ

నగరంలో సంచలనం సృష్టించిన దిశ కేసులో నిందితులను వారం రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిచ్చింది షాద్ నగర్ కోర్టు. దీంతో రేపటి(డిసెంబర్ 5) నుండి నలుగురు నిందితులను కస్టడీలోకి తీసుకోని విచారించనున్నారు పోలీసులు. నలుగురు నిందితులు ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్నారు. ఇప్పటికే పలు కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు విచారణలో నిందితుల నుండి మరింత సమాచారం రాబట్టనున్నారు.

దిశను హత్యచేసిన తర్వాతే నిందితులు దహనం చేశారని పోలీసులు చెప్పారు. కానీ బతికుండగానే దిశను కాల్చిచంపినట్లు నిందితులు జైల్లో చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో వారం రోజుల కస్టడీలో నిందితులను మరింత లోతుగా విచారించనున్నారు  పోలీసులు .

Latest Updates