video viral : బస్సు డ్రైవర్‌పై దాడి చేసిన పోలీస్

video viral : బస్సు డ్రైవర్‌పై దాడి చేసిన పోలీస్

బైక్ పై వెళ్తున్న పోలీస్ అధికారి ఆర్టీసీ బస్సును అడ్డకొని డ్రైవర్ పై దాడికి దిగాడు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మహారాష్ట్రలోని పూణేలో ఈ సంఘటన జరిగింది. బైక్ పై వెళ్తున్న పోలీస్ పీఎంపీఎంఎల్‌ బస్సు చాలా దగ్గరగా వెళ్లడంతో అతను కోపానికి గురైయ్యాడు. వెంటనే బస్సును క్రాస్ చేసి.. బస్ కు అడ్డంగా బైక్ పెట్టాడు.

బస్సులోని ఎక్కి డ్రైవర్ ను ఎడాపెడా కొడుతున్నాడు. డ్రైవర్ సీటు నుంచి అతన్ని బయటకు లాగి దాడి చేశాడు. రివర్స్ లో బస్సు డ్రైవర్ కొట్టడానికి ట్రై చేస్తే పోలీస్ హెల్మెట్‌ ధరించి ఉన్నాడు. బస్సు డ్రైవర్‌పై పోలీస్‌ దాడి చేసిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. వీడియో చూసిన  నెటిజన్లు పోలీస్ పై ఫైర్ అవుతున్నారు. బస్సు డ్రైవర్‌ను కొట్టిన పోలీస్‌పై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్‌ చేశారు.